మాజీ కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి చిదంబరను బుధవారం రాత్రి సీబీఐ అధికారులు అరెస్ట్ చేసారు. ఐఎన్‌ఎక్స్ మీడియాకు సంబధిత నగదు అక్రమ చలామణి కేసులో ఈయనను అరెస్ట్ చేశారు. చిదంబరం నివాసంలోనే అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఆయన అరెస్ట్ విషయానికి వస్తే… కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని అరెస్టు చేయటాన్ని తెలుగు ప్రజలు పూర్తిగా మద్దతు పలుకుతున్నారు. చిదంబరాన్ని అరెస్టు చేయాల్సిందే అంటూ గట్టిగా చెబుతున్నారు. సోషల్ మీడియాలో..కొన్ని టీవీ చానెళ్ల చర్చ కార్యక్రమంలో చిదంబరాన్ని అరెస్టు చేయటం మంచిదే అంటున్నారు. అసలేం జరిగిందంటే ప్రత్యేక తెలంగాణా సాధనకు డిమాండ్ ఉన్నప్పటికి నిజానికి అప్పట్లో అంత సెంటిమెంట్ అయితే లేదు. డిమాండ్ ను అవకాశంగా తీసుకున్న చిదంబరం చాలా స్పీడుగా పావులు కదిపారు. రాష్ట్ర విభజన నిర్ణయంపై అప్పట్లో కేంద్రం నియమించిన కమిటిలో చిదంబరమే కీలక పాత్ర పోషించారు. వివిధ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరపటం, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును అంగీకరింపచేయటం లాంటి తెరవెనుక వ్యవహారాలు నడపటంలో చిదంబరమే కీలకమనే అభిప్రాయం జనాల్లో కనిపించింది. వైసీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని పదేళ్ళ క్రితం అరెస్టు చేయటంలో కూడా చిదంబరమే కీలకమని అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధి అధికారాన్ని ధిక్కరించి మరీ వైఎస్ జగన్ పార్టీ నుండి బయటకు వచ్చేశారు. దాంతో జగన్ పై కుట్ర చేసి ముఖ్యనేతలంతా కలిసి చిదంబరాన్ని ముందుపెట్టి జగన్ పై సీబీఐ, ఈడిలతో కేసులు పెట్టించినట్లు సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతున్నది. అంటున్నారు. కాబట్టే చిదంబరం అరెస్టుపై తెలుగు రాష్ట్రాల ప్రజలు ఫుల్లుగా హ్యాపీగా ఉన్నారంట.
