శ్రీకాళుళంలో జరిగిన టీడీపీ పార్టీ సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు కాసేపు ప్రజలను తిట్టి..మరికాసేపు తనకు తాను సెల్ఫ్ డబ్బాకొట్టుకున్నాడు. కుటుంబానికి పెద్దకొడుకుగా ఉంటానని ఎన్నికల ప్రచారంలో నేను చెప్పినా.., ప్రజలు తెలిసో, తెలియకో జగన్‌కు ఓట్లేసి మోసపోయారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఎందుకు ఓటేశామని మధనపడుతున్నారంటూ..ప్రజల తీర్పును అవమానించేలా బాబు వ్యాఖ్యలు చేశాడు. అలాగే ఇసుక రవాణా, గ్రామవాలంటీర్ల ఉద్యోగాలు, పోలవరం రివర్స్ టెండరింగ్, రైతు రుణమాఫీ రద్దు వంటి అంశాలపై చంద్రబాబు సీఎం తీవ్ర విమర్శలు చేశాడు. అలాగే 14 ఏళ్లు సీఎంగా చేసిన నాకు డీజీపీ చట్టాల గురించి చెబుతున్నారంటూ చంద్రబాబు ఆక్రోళం వెళ్లగక్కారు. అయితే తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబు వ్యాఖ్యలపై మండిపడ్డారు. వర్షాలు కురిసి నదులు పొంగి ప్రవహిస్తుంటే చంద్రబాబు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నాడు. ఆయనకెప్పుడూ నదులు ఎండిపోయి ఇసుక తిన్నెలు తేలి కనిపించాలి. ఆ ఇసుకును దోచుకుని పదివేల మంది కోటీశ్వరులయ్యారు. జలాశయాలన్నీ నిండితే తట్టుకోలేక పోతున్నాడంటూ విజయసాయిరెడ్డి ధీటుగా బదులిచ్చాడు. తాను ఇచ్చిన రుణ మాఫీ హామీని మీరెందుకు అమలు చేయరని దబాయిస్తున్నాడు. ఇంటి పన్ను, ఇతర ట్యాక్సులు వసూలు చేయడం లేదా అని ప్రశ్నిస్తాడు. కాంట్రాక్టర్ల బిల్లుల గురించి ఒకటే ఆందోళన. వర్క్ ఆర్డర్ లేని పనులకు పేమెంట్స్ ఎవరు చేయాలి? తర్కానికి అందని వాదనలు చేస్తే ఎలా బాబుగారు అంటూ విజయసాయిరెడ్డి వ్యంగంగా ప్రశ్నించారు. ఇంకా బాబుగారు మీడియా ముందైనా, సమీక్షా సమేవేశాలైనా మూడు విషయాలు తప్పనిసరిగా చెబ్తాడని ముందే తెలిసి పోతుంది. 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 ఏళ్ల సిఎం, పదేళ్ల అపోజిషన్ లీడర్. ఇవి లేకుండా మాట్లాడలేడు. ఇంకెవరైనా చెబితే బాగుంటుంది కానీ సమయం సందర్భం లేకుండా మీకు మీరే చెప్పుకుంటే ఎలా బాబుగారు అంటూ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ప్రతిదానికి ? అవునా కాదా తమ్ముళ్లూ’ అంటూ చంద్రబాబు దీనాలాపనలు చేస్తున్నాడు. తను ఎంత ఆవేశపడుతున్నా తమాషా చూస్తున్నట్టు ఏ స్పందన లేకుండా కూర్చున్నారేమిటని కార్యకర్తల వైపు అనుమానంగా చూస్తున్నాడు. పోలవరం, అమరావతి, పిపిఏ ల గురించి అవే పాచి మాటలు. మాటల్లో ఎందుకో వణుకు కనిపిస్తోందంటూ విజయసాయిరెడ్డి చంద్రబాబును వెటకారం ఆడారు. మొత్తంగా చంద్రబాబు విమర్శలకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా వేసిన సెటైర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
