Home / ANDHRAPRADESH / దుబాయ్‌లో సీఎం రమేష్ కొడుకు ఎంగేజ్‌మెంట్‌లో ఏం జరుగుతోంది.అసలు కథ ఇదే..!

దుబాయ్‌లో సీఎం రమేష్ కొడుకు ఎంగేజ్‌మెంట్‌లో ఏం జరుగుతోంది.అసలు కథ ఇదే..!

ఒకప్పడు చంద్రబాబుకు ప్రధాన ఆర్థిక వనరుగా వ్యవహరించిన సీఎం రమేష్ 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత సుజనాచౌదరితో కలిసి, బీజేపీలో చేరారు. మళ్లీ బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతున్న చంద్రబాబే..సీఎం రమేష్, సుజనాలతో పాటు ఉన్న నలుగురు రాజ్యసభ ఎంపీలను బీజేపీలోకి పంపించాడని ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికలప్పుడు మోదీని దింపేస్తా..అని రంకెలు వేసిన బాబుగారు మరోసారి యూటర్న్‌ తీసుకున్నారు. మళ్లీ బీజేపీ పంచన చేరేందుకు నానా తంటాలు పడుతున్నాడు. అయితే ఏపీ బీజేపీలో ఇప్పుడు విచిత్ర పరిస్థితి నెలకొంది. సుజనా, రమేష్‌లు బాబుకు అనుకూలంగా వాయిస్ వినిపిస్తుండగా..జీవీయల్, సోమువీర్రాజులాంటి నేతలు బాబు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. అయితే మళ్లీ మోదీతో కలిసేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. తాజాగా దుబాయ్‌లో సీఎం రమేష్ కొడుకు ఎంగేజ్‌మెంట్ ఇప్పుడు బాబుగారికి బాగా కలిసివచ్చింది. ఈ ఫంక్షన్‌కు సీఎం రమేష్ ఏకంగా 75 మంది ఎంపీలకు ఆహ్వానం పలికాడు. అతిథులను దుబాయ్‌కు తీసుకువెళ్లడానికి ఏకంగా 15 విమానాలు బుక్ చేశాడంటే సీఎం రమేష్ ఏ స్థాయిలో ఖర్చుపెడుతున్నాడో అర్థమవుతుంది. కాగా పేరుకు ఫంక్షన్ అయినా..సీఎం రమేష్ బీజేపీ, టీడీపీ నేతల మధ్య రాయబారం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే అమరావతిని ఇండియా మ్యాప్‌లో చేర్చడంలో కీలక పాత్ర వహించిన కిషన్ రెడ్డికి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపాడు. కాగా ఈ ఫంక్షన్‌లో మళ్లీ ఎలాగైనా మోదీకి దగ్గరయ్యేలా చేయమని టీడీపీ నేతల ద్వారా బీజేపీ పెద్దలను చంద్రబాబు బతిమాలుకున్నట్లు సమాచారం. దేశంలో ఇలాంటి పనులు ఎక్కడ చేసినా..మీడియాకు దొరికిపోతామని భావించిన చంద్రబాబు..అదే దుబాయ్‌లో అయితే మీడియాకు పెద్దగా అవకాశం లేదు కాబట్టి..టైమ్..ప్లేస్ చూసుకుని మరీ బీజేపీతో కలిసేందుకు సీఎంరమేష్, సుజనాలతో రాయబారం నడిపిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. మొత్తంగా పైకి దుబాయ్‌లో సీఎం రమేష్ కొడుకు ఎంగేజ్‌మెంట్ జోరుగా జరుగుతున్నా..లోపల బీజేపీ, టీడీపీ నేతల మధ్య సెటిల్‌మెంట్ వ్యవహారం కూడా జోరుగా సాగుతుందని టాక్. ఇది దుబాయ్‌లో సీఎం రమేష్ కొడుకు ఎంగే‌జ్‌మెంట్ పేరుతో జరుగుతున్న తంతు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat