ఏపీలో స్థానిక సంస్థల రిజర్వేషన్లపై టీడీపీ అధినేత చంద్రబాబు కుళ్ళు రాజకీయం చేస్తున్నాడు. బీసీలకు 59 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్నతీసుకున్న నిర్ణయంపై చంద్రబాబు హైకోర్ట్ లో కేసు వేయించిన విషయం తెలిసిందే. దీంతో రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని, అలాగే నెలలోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు జారి చేసింది. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు మల్లా మరోకొత్త ప్లాన్ కు సిద్దమయ్యారు చంద్రబాబు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి “స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు 59.85 శాతానికి ఎలా పెంచుతారని ప్రతాపరెడ్డి తో కేసు వేయించి కొట్టేయిస్తాడు. మళ్లీ బిసి నాయకులను ఉసిగొల్పి కోర్టు చెప్పినంత మాత్రాన 50 శాతానికి ఎలా తగ్గిస్తారని లిటిగేషన్ మొదలు పెడతాడు. ఎన్నికలు జరగొద్దనేది అసలు ఉద్దేశం. సిగ్గు,శరం లేని మనిషి” అని ధ్వజమెత్తారు.
