2014 ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి చివరికి గెలిచాక చంద్రబాబు చేతులెత్తేసిన విషయం అందరికి తెలిసిందే. బాబు హయంలో ప్రకృతి కూడా అంతగా సహకరించలేదు..అలాంటి సమయంలో కూడా చంద్రబాబు తన వంటిచేత్తో తుఫాన్లు అడ్డుకున్నానని చెప్పుకొచ్చారు. ఇలా అధికారంలో ఉన్నంతసేపు ఎన్నెన్నో మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టాడు. అయితే ఇప్పుడు తాజాగా కరోనా మహమ్మారి ప్రపంచాన్నే వణికిస్తుంది. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి “పవర్ పోయిన దిగులులో ఉన్నాడు కానీ లేకపోతే జనతా కర్ఫ్యూ ఐడియా ప్రధానికిచ్చింది తనేనని బొంకేవాడు. చైనా ప్రెసిడెంట్ కూ ధైర్యం చెప్పిన బాబు అంటూ ఎల్లో మీడియా రోజంతా దంచేది. వీడియో కాన్ఫరెన్సులతో అధికారులను ఏడిపించేవాడు. నిధులు నాకేందుకు రకరకాల స్కీమ్స్ మొదలయ్యేవి” అని అన్నారు.
