టీడీపీ ఆవిర్భావ దినోత్సవమో, మహానాడు కార్యక్రమమో అయితే తప్ప మిగతా సమయాల్లో ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు ఎన్టీఆర్ గుర్తురారని వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను విమర్శించారు. 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా టీడీపీ నిర్వహించిన సభలో అన్నీ అబద్ధాలే చెప్పారని ఆయన ఆరోపించారు.
ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని చెప్తున్న చంద్రబాబు.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని ఒక్క జిల్లాకు కూడా ఎన్టీఆర్ పేరు ఎందుకు పెట్టలేదని నిలదీశారు. సీఎం జగన్ కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి ఆయనపై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారని ఉదయభాను చెప్పారు.