Home / ANDHRAPRADESH / జ‌గ‌న్‌పై కేసుల వెనుక అస‌లు నిజం చెప్పిన సుప్రీం కోర్టు న్యాయ‌వాది..!!

జ‌గ‌న్‌పై కేసుల వెనుక అస‌లు నిజం చెప్పిన సుప్రీం కోర్టు న్యాయ‌వాది..!!

వైసీపీ అధినేత, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అప్పటి ఉమ్మడి ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్ ,టీడీపీ లకు చెందిన మాజీ ఎమ్మెల్యే శంకర్రావు, దివంగత టీడీపీ నేత ఎర్రన్నాయుడు ప్రస్తుత నవ్యాంధ్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టిన విష‌యం విధిత‌మే. వైఎస్ జ‌గ‌న్ రాజ‌కీయ ఎదుగుద‌ల‌ను, అలాగే, ప్ర‌జ‌ల్లో జ‌గ‌న్‌కు ఉన్న ఆద‌ర‌ణ‌ను చూసి ఓర్వ‌లేని ఇత‌ర పార్టీల స‌భ్యులు ఎన్ని కేసులు పెట్టినా.. ఆ కేసుల‌న్నింటిలోనూ వైఎస్ జ‌గ‌న్ నిర్దోషిగా బ‌య‌ట‌కు రావ‌డం ఖ‌చ్చిత‌మంటూ బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెబుతున్నారు రిటైర్డ్ సీబీఐ అధికారులు, అలాగే, సుప్రీం కోర్టు న్యాయ‌వాదులు.

అయితే, గ‌త అధికార పార్టీలు జ‌గ‌న్‌పై పెట్టిన అక్ర‌మ కేసులు కోర్టులో అలా విచార‌ణ‌కు వ‌చ్చి.. ఇలా వీగిపోతున్న విష‌యం తెలిసిందే. అయితే తాజాగా ఈడీ అటాచ్ చేసిన జగన్ కు చెందిన జగపతి పబ్లికేషన్ ముప్పై నాలుగు కోట్ల ఆస్తులపై ఉన్న పీఎంఎల్ఏను ట్రిబ్యునల్ కొట్టేసింది. అంతేకాకుండా, అంత‌కు ముందు జ‌గ‌న్‌పై ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట్‌) న‌మోదు చేసిన కేసుల‌ను అప్పిలేట్‌ ట్రిబ్యునల్ కొట్టేసిన విష‌యం తెలిసిందే. దీంతో వైఎస్ జ‌గ‌న్‌పై ఉన్న కేసుల‌న్నీ క‌క్ష్య‌పూరిత‌మైన‌విగానే భావించ‌డానికి ఇంత‌క‌న్నా ఆధారాలు చూపించాల్సిన ప‌రిస్థితి లేద‌న్న‌ది రాజ‌కీయ విశ్లేష‌కుల మాట‌.

see also :

మీరు మ‌క్కెలిర‌గ్గొడితే… ప్ర‌జ‌లు తాట తీస్తారు..!!

ఇదిలా ఉండ‌గా.. వైఎస్ జ‌గ‌న్ పై బ‌నాయించిన అక్ర‌మ కేసుల‌పై సుప్రీం కోర్టు సీనియ‌ర్ న్యాయ‌వాది ర‌వి శంక‌ర్ సంచ‌ల‌న విషయాల‌ను వెల్ల‌డించారు. వైఎస్ జ‌గ‌న్‌పై పెట్టిన అక్రమ కేసుల‌న్నీ కోర్టుకు వ‌చ్చిన వెంట‌నే వీగిపోతున్నాయ‌ని, అంతేకాకుండా, సీబీఐ, ఈడీ నిందితులుగా పేర్కొన్న ఐఏఎస్‌లు, మ‌రికొంద‌రు ఇప్ప‌టికే నిర్దోషులుగా బ‌య‌ట‌కు వ‌చ్చార‌న్నారు. జ‌గ‌న్‌పై బ‌నాయించిన కేసులు ఇలా కోర్టుకు వ‌చ్చి.. అలా వీగిపోతున్నాయ‌ని,అందులో భాగంగానే ఇప్ప‌టి వ‌ర‌కు కోర్టు విచారించిన కేసుల‌న్నింటిలో వైఎస్ జ‌గ‌న్ నిర్దోషిగా తేలార‌న్నారు.

ఒక రాజ‌కీయ నాయ‌కుడిని కానీ, వారి వ్య‌క్తిగ‌త జీవితాన్ని ఇలా చేయ‌డం సీబీఐకు త‌గ‌ద‌ని, కొంద‌రు రాజ‌కీయ నాయ‌కులు వారి రాజ‌కీయ ల‌బ్ధి కోసం మ‌రికొంద‌రి జీవితాల‌తో ఆడుకునేందుకు సీబీఐని వాడుకుంటున్నారంటూ మీడియా ముఖంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఉదాహ‌ర‌ణ చెబుతూ :- ఫుట్‌పాత్ మీద ఎవ‌డో ప‌రుగెడుతుంటే.. అత‌ని ముఖం కూడా చూడ‌కుండా ర‌వి శంక‌ర్ ప‌రుగెత్తాడండీ అని చెప్ప‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని, జ‌గ‌న్ కేసులో కూడా ఇదే తీరు కొన‌సాగుతోందంటూ త‌న దైన శైలిలో చెప్పారు సుప్రీం కోర్టు సీనియ‌ర్ న్యాయ‌వాది ర‌విశంక‌ర్‌. క్విడ్ ప్రో కేసు గురించి మాట్లాడుతూ.. క్విడ్ ప్రోక్రో కేసులేనూ ఎక్క‌డా వైఎస్ జ‌గ‌న్ ఇన్వాల్వ్‌మెంట్ లేద‌న్నారు. ఆ కేసుకు సంబంధించిన ఫైల్ మూమెంట్‌కు జ‌గ‌న్‌కు సంబంధం లేద‌ని స్ప‌ష్ట‌త‌నిచ్చారు ర‌వి శంక‌ర్‌.

see also : శ్రీరెడ్డి..ఇష్టం లేకపోతే పట్టుకెళ్లిపోయి రేప్ చేసేవాళ్లయితే లేరు..మ‌రో న‌టి సంచ‌ల‌న వాఖ్య‌లు..!